హోసునూరులో వ్యాపారి హ‌త్య‌

  Written by : Suryaa Desk Updated: Wed, Oct 23, 2019, 01:59 AM
 

క‌ర్నాట‌క‌లోని హొసూరు  సమీపంలో కొబ్బరికాయల వ్యాపారిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు.ఈ ఘ‌ట‌న‌పై రాయ‌కోట పోలీసులు అందించిన విబ‌రాల ప్ర‌కారం  కృష్ణగిరి జిల్లా కెలమంగలం సమీపంలోని యడవన హళ్లి గ్రామానికి చెందిన సాకప్ప(65) కొబ్బరికాయలు వ్యాపారం చేస్తూ, చీటీలు నడుపుతున్నారు.


అయితే  సోమవారం అర్ధరాత్రి అంతా నిద్ర‌పోతున్న వేళ‌ ఎనిమిది మంది గుర్తు తెలియని వ్యక్తులు ముసుగులు ధ‌రించి సాకప్ప ఇంట్లోకి చొరబడి వేట కొడవలితో నరికారు. ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడిన సాకప్పను స్థానికులు హొసూరు ప్రభుత్వాస్పత్రికి తరలించిన కొద్ది సేప‌టికే ఆయన మరణించాడని వివ‌రించారు. ఈ సంఘటనపై కేసు న‌మోదు చేసిన రాయకోట పోలీసులు విచారణ జరుపుతున్నారు. దుండగుల ఆచూకీని కనుక్కోవడానికి  ప్ర‌త్యేక ద‌ళాన్ని రంగంలోకి దింపిన‌ట్టు తెలిపారు.