ఇక మేం చేసేది అణు యుద్ధ‌మే...

  Written by : Suryaa Desk Updated: Wed, Oct 23, 2019, 01:29 AM
 

   త‌మ దేశంలో ఎవ‌రు యుద్ధానికి దిగినా  ఈసారి సంప్రదాయ యుద్ధం ఉండదని, ఇక అణు యుద్ధమే జరుగుతుందని బెదిరించారు పాకిస్థాన్ రైల్వే మంత్రి షేక్ రషీద్. మంగ‌ళ‌వారం ఆయ‌న పాక్ మీడియాలో మాట్లాడుతూ స‌రిహ‌ద్దుల‌లో త‌మ సైన్యం ముమ్మరంగా ఉంద‌ని,  తమ వద్ద 125 గ్రాములు, 250 గ్రాముల అణు బాంబులు ఉన్నాయని, లక్ష్యాన్ని కచ్చితంగా ఛేదించగలవని , ఎవ‌రు యుద్‌దానికి దిగినా వారిని వ‌దిలి పెట్ట‌బోమ‌ని అన్నారు జ  అయితే ఆయన భారత దేశం పేరును నేరుగా ప్రస్తావించక పోవ‌టం గ‌మ‌నార్హం. ఆయన వ్యాఖ్యలపై పాకిస్థాన్ ప్రభుత్వం స్పందించన‌ప్ప‌టికీ  నియంత్రణ రేఖ వెంబడి బలగాలను మోహరించేందుకు పాకిస్థాన్ సైన్యం కు త‌గిన ఆదేశాలిచ్చిన‌ట్టే క‌నిపిస్తోంది. పెద్ద ఎత్తున ఆయుధాన‌ల‌తో పాటు యుద్ధ ట్యాంకులను కూడా సరిహద్దులకు తరలిస్తూ, క్ర‌మ‌క్ర‌మంగా సైనికుల సంఖ్యను పెంచుతోందని అక్క‌డి మీడియా చెపుతోంది.