క్వార్టర్స్‌కు దూసుకెళ్లిన భారత బాక్సర్లు...

  Written by : Suryaa Desk Updated: Tue, Oct 22, 2019, 06:30 PM
 

చైనాలో జరుగుతున్న ప్రపంచ సైనిక క్రీడల్లో భారత బాక్సర్లు క్వార్టర్స్‌కు దూసుకెళ్లారు. పురుషుల 51 కేజీల విభాగం రెండో రౌండ్‌లో తునీసియా బాక్సర్‌ బుగాన్మి బిలాల్‌ను భారత యువ బాక్సర్‌ అమిత్‌ పంగాల్‌ 4-1 తేడాతో ఓడించాడు. ఇటీవల జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో అమిత్ రజతం సాధించిన విషయం తెలిసిందే. 49 కేజీల విభాగంలో వియత్నాం క్రీడాకారుడు లిన్హ్‌ ఫుంగ్‌ను దీపక్‌ 5-0 తేడాతో ఓడించాడు. 56 కేజీలో విభాగంలోనూ భారత బాక్సర్‌ క్వార్టర్‌ ఫైనల్‌కు చేరాడు. వెనిజులా బాక్సర్ బొనిలాపై చిరాగ్‌ 5-0తో విజయం సాధించాడు. ప్రపంచ సైనిక క్రీడలను 25 విభాగాల్లో నిర్వహిస్తున్నారు. 109 దేశాలకు చెందిన 9,308 సైనిక క్రీడాకారులు దీనిలో పాల్గొంటున్నారు. భారత్‌ తరఫున తొమ్మిది క్రీడా విభాగాల్లో 54 మంది ఆటగాళ్లు పాల్గొన్నారు.