ఇండియన్ ఆర్మీ మెరుపు దాడి

  Written by : Suryaa Desk Updated: Tue, Oct 22, 2019, 06:17 PM
 

సరిహద్దులో భారత సైన్యం మరో సారి తన సత్తా చాటింది. ఇండియన్ ఆర్మీ మంగళవారం మరో సారి పాక్ ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడి నిర్వహించింది. ఈ దాడిలో 50 మంది టెర్రరిస్టులు హతమైనట్లు సమాచారం. ఇదే దాడిలో 7గురు పాక్ కమాండర్లు మృతి చెందినట్లు తెలుస్తోంది. దీంతో భారత్ - పాక్ సరిహద్దు వెంబడి ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. ఇప్పటికే ఉగ్రస్థావరాలపై భారత్ మెరుపు దాడులు చేసి దాయాది దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న తరుణంలో తాజా దాడితో ఆ దేశం డిఫెన్స్ లో పడినట్లు తెలుస్తోంది.