వెన్నునొప్పితో ఆస్పత్రిలో చేరిన రాబర్ట్ వాద్రా

  Written by : Suryaa Desk Updated: Tue, Oct 22, 2019, 11:22 AM
 

ప్రముఖ పారిశ్రామికవేత్త, కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్ వాద్రా వెన్నునొప్పి సమస్యతో నోయిడాలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. ఆసుపత్రిలోని ఆర్ధోపెడిక్ వైద్య విభాగంలో చేరిన రాబర్ట్ వాద్రాకు వైద్యులు చికిత్స చేశారు. ప్రియాంకాగాంధీ కూడా రాబర్ట్ వాద్రాతో రాత్రంగా ఆసుపత్రిలోనే ఉన్నారు. కాలికి బ్యాండేజ్ తో ఆసుపత్రిలో రాబర్ట్ వాద్రా విశ్రాంతి తీసుకున్నారు. రాబర్ట్ వాద్రా ఆరోగ్య పరిస్థితిపై ఆసుపత్రి వర్గాలు ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు.