గాంధీ జాతి పిత కాద‌ట‌....సాధ్వీ కొత్త మాట‌

  Written by : Suryaa Desk Updated: Mon, Oct 21, 2019, 07:12 PM
 

నిత్యం వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు చేస్తూ వార్త‌ల‌లో ఉండే  బిజెపి ఎంపి సాధ్వీ  మ‌రోమారు గాంధీపైనే అనుచిత వ్యాఖ్యలు చేశారు. సోమ‌వారం భోపాల్ వ‌చ్చిన ఆమె రైల్వేస్టేష‌న్‌లో  మీడియాతో మాట్లాడుతూ.. గాంధీ జాతి పిత కాదని.. జాతి కుమారుడు అని కొత్త అర్థం చెపుతూ అందుకే గాంధీని ప్రతి ఒక్కరు గుర్తుంచుకుంటారని పేర్కొన్నారు. గాంధీ 150వ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలను కలుపుతూ బీజేపీ గాంధీ సంకల్ప్ యాత్ర  చేపడుతున్నా  సాద్వీ ఆర్యాలీల‌లో  పాల్గొనక పోవ‌టాన్ని మీడియా ప్ర‌తినిధి ఒక‌రు ప్ర‌శ్నిస్తే......క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేయ‌కుండా.....  గాంధీ జాతి జాతి పిత‌కాదు... జాతి కుమారుడు, అతనిని తానేప్పుడు గౌరవిస్తానని చెప్పడం విశేషం.  తమకు స్వాతంత్ర్యం సిద్ధించిన నేతల పట్ల గౌరవం సర్వదా ఇస్తానని పేర్కొన్నారు. ఇటీవల నాథురాం గాడ్సేను   కొనియాడిన సాద్వీ,  దేశ విభజనపై కూడా నోరుపారేసుకోవడం కలకలం రేపిన విష‌యం విదిత‌మే.