ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు..!

  Written by : Suryaa Desk Updated: Mon, Oct 21, 2019, 06:36 PM
 

మహారాష్ట్ర, హరియాణా శాసనసభ ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా 52 స్థానాల్లో ఉపఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు ప్రముఖులు పోలింగ్‌ కేంద్రాలకు వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. బాంద్రా (వెస్ట్) లోని పోలింగ్ బూత్ వద్ద ఓటు వేయడానికి వచ్చిన నటుడు అమీర్ ఖాన్ ఓటు వేశారు. అలాగే మాజీ టెన్నిస్ ప్లేయర్ మహేష్ భూపతి ఆయన భార్య లారా దత్తా, నటి మాదూరీ దీక్షిత్, ఓటు హక్కు వినియోగించుకున్నారు.
లాతుర్‌లోని పోలింగ్ బూత్‌లో రితేశ్ దేశ్‌ముఖ్, అతని భార్య జెనెలియా డిసౌజా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ఆయన భార్య అమృత, అమ్మ సరిత నాగ్ పూర్ లో ఓటు వేశారు. అతని సోదరులు అమిత్ దేశ్‌ముఖ్, ధీరజ్ దేశ్‌ముఖ్ కాంగ్రెస్ ఎమ్యెల్యే అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ సైకిల్ తొక్కుతూ కర్నాల్ పోలింగ్ కేంద్రం వద్దకు వచ్చి అందరి దృష్టినీ ఆకర్షించారు. ఆయనతో పాటు పలువురు కార్యకర్తలు కూడా సైకిల్ పైనే పోలింగ్ కేంద్రానికి వచ్చారు.