వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి

  Written by : Suryaa Desk Updated: Mon, Oct 21, 2019, 06:22 PM
 

వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుందని బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్‌దేవ్‌ధర్‌ సృష్టం చేశారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ, పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే బరిలోకి దిగుతుందని అన్నారు. రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేసే దిశగా కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. తిరుపతిలో నిర్వహించిన మహాత్మాగాంధీ సంకల్ప యాత్రలో సునీల్‌ దేవ్‌ధర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్ముడి ఆశయాలను నెరవేర్చే దిశగా ప్రధాని మోదీ పాలన సాగిస్తున్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 48 వేలకు పైగా బూత్‌ కమిటీల్లో 11 వేల బూత్‌ కమిటీలు ఇప్పటికే పూర్తయ్యాయని చెప్పేందుకు చాలా సంతోషంగా ఉందన్నారు.