ప్రధానిని ప్రశ్నించిన ఉపాసన

  Written by : Suryaa Desk Updated: Mon, Oct 21, 2019, 06:17 PM
 

భారత సినీరంగానికి చెందిన పలువురు ప్రముఖులతో ప్రధాని మోదీ ఢిల్లీలోని తన నివాసంలో భేటీ అయ్యారు. మహాత్మాగాంధీ 150వ జయంతిని పుస్కరించుకొని వినోదరంగానికి చెందని వివిధ విభాగాలు తయారు చేసిన సాంస్కృతిక వీడియోలను మోదీ విడుదల చేశారు. అయితే ఈ వేడుకలో హిందీ సినీ, టీవీ రంగానికి చెందిన తారలు మాత్రమే కనిపించారు. ఈ విషయమై అగ్రహీరో రామ్‌చరణ్‌ సతీమణి ఉపాసన ట్వీట్టర్‌ ద్వారా తన అసంతృప్తిని వ్యక్తం చేసింది. ప్రధానిగారు.. దక్షిణాది తారలను కూడా గుర్తించండి అంటూ ఓ పోస్ట్‌ చేశారు. గౌరవ ప్రధాని నరేంద్ర మోదీగారికి.. మీరు ప్రధాని అయినందుకు మాకు గర్వంగా ఉంది. దక్షిణ భాతర ప్రజలకు కూడా మీరంటే గౌరవం. సినీ ప్రముఖులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కేవలం బాలీవుడ్‌ తారల్ని మాత్రమే ఆహ్వానించారు. సౌత్‌ ఇండియా నటీనటుల్ని విస్మరించారు. దక్షిణాది తారల్ని కూడా గుర్తించాలని కోరుకుంటున్నా. బాధతో మీకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నా. ఈ అంశాన్ని మీరు అర్థం చేసుకుంటారనే విశ్వాసం ఉంది అని ఉపసాన ట్విట్టర్‌లో పేర్కొంది. ప్రస్తుతం ఈ ట్వీట్‌ సోషల్‌మీడియాలో వైరల్‌ మారింది.