రైల్వేస్టేషన్‌లో పేలిన బాక్స్‌

  Written by : Suryaa Desk Updated: Mon, Oct 21, 2019, 03:33 PM
 

కర్ణాటకలోని హుబ్లీ రైల్వేస్టేషన్‌లో బాక్స్‌ పేలింది. ఈ ఘటనలో హుస్సేన్‌ సాబ్‌ నాయక్‌వాలె అనే వ్యక్తికి గాయాలయ్యాయి. అతన్ని కిమ్స్‌ ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. పేలుడు ధాటికి స్టేషన్ లో ఆవరణలో ఉన్న అద్దాలు పగిలిపోయాయి. హుస్సేన్‌ పట్టుకెళ్తున్న బాక్స్‌ పేలి ఈ ఘటన జరిగినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. పేలిన బాక్స్‌ కాన్పూర్‌ ఎమ్మెల్యే పేరుతో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఘటనాస్థలానికి చేరుకున్న బాంబు స్కాడ్‌ బృందాలు తనిఖీలు కొనసాగిస్తున్నాయి. కేసు నమోదు చేసిన పోలీసులు పేలుడు ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.