శివకుమార్‌ మానసికంగా ఎంతో బలాఢ్యుడు : కుమారస్వామి

  Written by : Suryaa Desk Updated: Mon, Oct 21, 2019, 11:33 AM
 

తీహార్‌ జైలులో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ నేత డికె శివకుమార్‌ను కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డి కుమారస్వామి కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజకీయ అంశాలు వేరని, వ్యక్తిగత స్నేహాలు వేరని చెప్పారు. ఇది తన వ్యక్తిగత పర్యటన అని ఆయన అన్నారు. శివకుమార్‌ రాజకీయ వేధింపులకు గురవుతున్నారని ఆయన అన్నారు. శివకుమార్‌ మానసికంగా ఎంతో బలాఢ్యుడని, ఈ పోరాటాన్ని ధైర్యంగా ఎదుర్కొంటారని ఆయన అన్నారు.