ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మీడియాపై దాడుల‌కు నిర‌స‌న‌గా... వార్తాంశాలు కొట్టివేత‌లు

international |  Suryaa Desk  | Published : Mon, Oct 21, 2019, 10:50 AM

 పత్రికా స్వేచ్ఛపై అణిచివేతకు నిరసనగా ఆస్ట్రేలియా వ్యాప్తంగా వార్తాపత్రికలు సోమవారం ఎడిష‌న్ల‌లో వార్తాంశాల‌ను కొట్టివేస్తూ ప్ర‌చురించి త‌మ నిర‌స‌న‌ని తెలిపాయి. ప్రభుత్వ గోప్యతకు వ్యతిరేకంగా    పేజీలను  ఇలా తీర్చిదిద్దిన‌ట్టు మీడియావ‌ర్గాలు చెపుతున్నాయి. ప్ర‌ధానంగా ఆస్ట్రేలియాలో అధిక స‌ర్క్యులేష‌న్ ఉన్న ది ఆస్ట్రేలియన్, ది సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ మరియు ఆస్ట్రేలియన్ ఫైనాన్షియల్ రివ్యూతో సహా ప‌లు జాతీయ, ప్రాంతీయ ప‌త్రిక‌లు  సోమవారం త‌మ మాస్ట్‌హెడ్‌లల‌లో ఈ త‌ర‌హా నిర‌స‌న వ్య‌క్తం చేయ‌టంతో అనూహ్యంగా అక్క‌డి ప్ర‌జ‌లు స్పందిస్తున్నారు.  


దేశంలోని టెలివిజన్ నెట్‌వర్క్‌లలో కూడా ఈ వార్తాంశాన్ని ప్ర‌ధానంగా చూపిస్తుండ‌టంతో ఆస్ట్రేలియా ప్ర‌భుత్వ వ‌ర్గాల‌లో ప్ర‌కంప‌న‌లు సృస్టిస్తోంది.   "ప్రభుత్వం   సత్యాన్ని దాచిపెట్టినప్పుడు, అవి ఎలా ప్ర‌కంప‌న‌లు చేస్తాయ‌న్న‌దానికి ప్ర‌స్తుత ప‌రిణామాలే సాక్ష్య‌మ‌ని అక్క‌డి మీడియా వ‌ర్గాలు చెపుతున్నాయి.  


ఈ ఏడాది ప్రారంభంలో ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించిన రెండు కథలపై  జాతీయ బ్రాడ్‌కాస్ట్‌ ఎబిసి,న్యూస్ కార్ప్ జర్నలిస్ట్ ఇంటిపై ఫెడరల్ పోలీసులు దాడి చేయ‌టం వివాదానికి తెర‌లేపింది.  


 కఠినమైన జాతీయ భద్రతా చట్టాల నుండి జర్నలిస్టులకు మినహాయింపులు ఉన్నప్ప‌టికీ , ప్ర‌భుత్వం స‌రికొత్త‌గా తీసుకువ‌చ్చిన ఆరు నిబంధ‌న‌ల కార‌ణంగా ప్ర‌భుత్వ వ్య‌తిరేక వార్త‌లు రాసే పాత్రికేయుల‌పై ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకునే ఆస్కారం క‌లిగింది.  ఈ సంక్లిష్టమైన వెబ్ నిబంధనలు ఆస్ట్రేలియాలో సంచ‌ల‌నం సృష్టించాయి, విమర్శకులు, విలేకరులను చాలా సులభంగా ప్ర‌భుత్వం నేరంగా ప‌రిగ‌నించే కేసుల‌లో చిక్కుకుంటారన్న‌ది అక్క‌డి మీడియా ప్ర‌తినిధుల వాద‌న‌. 


అలాగే సిడ్నీలోని ఎబిసి ప్రధాన కార్యాలయంపై పోలీసులు జరిపిన దాడులులో ముగ్గురు జర్నలిస్టులు నేరారోపణలు ఎదుర్కొంటున్నారు ఆఫ్ఘనిస్తాన్‌లో ఆస్ట్రేలియా ప్రత్యేక దళాలు చేసిన యుద్ధ నేరాలను బహిర్గతం చేసినందుకు ఇద్దరు ఎబిసి రిపోర్టర్లపై కేసులూ న‌మోద‌య్యాయి. చట్టపరమైన నిబంధనలతోప్రతి ఆస్ట్రేలియన్ పూర్తి స‌మాచారం తెలుసుకునే హక్కును పరిమితం చేసేలా ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నిస్తోందని, దీనికి జాతీయ భద్రత ముసుగు తొడుగుతోంద‌న్న‌ది జ‌ర్న‌లిస్టుల ప్ర‌ధాన ఆరోప‌ణ‌. అయితే ప్ర‌భుత్వం యొక్క అసలు ఉద్దేశ్యం వేరొక‌లా ఉంద‌ని  మండి ప‌డుతున్నాయి. అందుకే మీడియా స్వేచ్ఛపై ప్రత్యక్ష దాడులకు దిగుతోంద‌న్న‌ది ప్ర‌ధాన ఆరోప‌ణ‌,


ఇక మీడియా రంగాలలో ఉన్న ప్ర‌తినిధుల‌పై విజిల్‌బ్లోయర్‌లకు మెరుగైన రక్షణ కల్పించాల్సిన ప్ర‌భుత్వం   వీరు పత్రికలకు ప్ర‌భుత్వంలోని అంశాలు లీక్  చేస్తున్నార‌ని ఆరోపిస్తూ  సంస్కరణల చ‌ట్టం క్రింద ప‌రువున‌ష్టం కేసులు దాఖ‌లు చేసే ప్ర‌య‌త్నాలు ఆరంభించ‌డంపై జ‌ర్న‌లిస్టులు మండి ప‌డుతున్నారు. వాస్త‌వానికి ఆస్ట్రేలియా లో అమ‌ల‌వుతున్న పరువు నష్టం చట్టాలు చాలా క్లిష్టమైనవి , ప్రపంచంలోనే కఠినమైనవిగా పేరుంది. ఈ కేసు దాఖ‌లైతే జీవితాంతం ఇబ్బందులు పెట్ట‌డం ఖాయ‌మ‌ని జ‌ర్న‌లిస్టుల ఆరోప‌ణ‌. 


చాలా ఉదారవాద ప్రజాస్వామ్య దేశాల మాదిరిగా కాకుండా,ఆస్ట్రేలియాకు హక్కుల బిల్లు లేదా వాక్ స్వేచ్ఛ కోసం రాజ్యాంగబద్ధంగా  రక్షణలు లేవు స‌రిక‌దా ప్ర‌భుత్వ తాజా నిర్ణ‌యాల‌తో జ‌ర్న‌లిస్టులు, మీడియా అధినేత‌లు సైతం బెంబేలు ప‌డే ప‌రిస్థితి నెల‌కొందన్న‌ది వాస్త‌వం


ఇదే అంశంపై ఆస్ట్రేలియా ప్రధానమంత్రి స్కాట్ మోరిసన్ మాత్రం భిన్నంగా స్పందిస్తూతన ప్రభుత్వం "పత్రికా స్వేచ్ఛను ఎల్లప్పుడూ విశ్వసిస్తుందని  కాని జర్నలిస్టులు చట్టానికి అతీతంగా లేరని ఆయన నొక్కి చెప్పారు. పత్రికా స్వేచ్ఛా విచారణ దాని ఫలితాలను వచ్చే ఏడాది పార్లమెంటుకు నివేదించనుందని తెలిపారు. 


.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com