ఓటు హక్కు వినియోగించుకున్న ఎన్‌సిపి నేత సుప్రియా సూలే

  Written by : Suryaa Desk Updated: Mon, Oct 21, 2019, 10:27 AM
 

మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకురాలు సుప్రియా సూలే తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. బారామతిలోని పోలింగ్‌ కేంద్రంలో ఆమె ఓటు వేశారు. ఆమె సోదరుడు, ఎన్‌సిపి అభ్యర్థి అజిత్‌ పవార్‌ ఈ నియోజక వర్గంనుంచి పోటీ చేస్తున్నారు. ఇక్కడినుంచి బిజెపి అభ్యర్థిగా గోపీచంద్‌ పడాల్కర్‌ పోటీ చేస్తున్నారు.