రైలు ఆల‌స్యానికి రూ. 250 ప‌రిహారం

  Written by : Suryaa Desk Updated: Mon, Oct 21, 2019, 12:50 AM
 

మ‌న భార‌తావ‌నిలో రైళ్లు వ‌చ్చి వెళ్లే స‌మ‌యం చెప్ప‌డం క‌ష్ట‌మే అని నానుడుండేంది అంటే  ఆలస్యంగా నడుస్తాయని దాని అర్ధం. అది నిజ‌మే  ఏ రోజు కూడా స్టేష‌న్‌లో నిర్దేశిత  సమయం ప్రకారం ప్రారంభం కావు. కనీసం రెండు మూడు నిమిషాలు ఆలస్యం చేస్తారు. పైగా మార్గ‌మ‌ధ్యంలో వేగం పెంచి నిర్ణీత సమయానికి  చేరుతుందా? అంటే అదీఅనుమాన‌మే .  చివ‌రాఖ‌రి స్టేషన్లకు చేరుకునే స‌రికి మ‌రింత ఆల‌స్యం అవుతుంద‌న్న ఈ సమస్య పై వ‌స్తున్న విమ‌ర్శ‌ను గుర్తుంచుకుని ఇటీవ‌ల కేంద్ర  కాస్త ఉపశమనం కల్పించేలా   చర్యలు ప్రారంభించింది.   సాధార‌ణ రైళ్ల‌కు భిన్నంగా తేజస్ రైళ్లను ప్రారంభించింది.  ఇటీవ‌ల లక్నో, ఢిల్లీ మధ్య న‌డిచిన‌ తేజస్ రైలు ఏకంగా రెండు గంటలు ఆలస్యంగా న‌డ‌వ‌టంతో ప్రయాణీకులు ఇబ్బందులు ప‌డ్డారు.  దీంతో ఈ రైలులో ఆలస్యంగా గమ్యస్థానం చేరుకుంటున్న 451 మంది ప్రయాణీకులను వారి టిక్కెటు అధారంగా గుర్తించి  ఒక్కొక్క‌రికీ రూ.250 చొప్పున రైల్వే అధికారులు పరిహారం చెల్లించారు. ఈ మేరకు ప్రయాణీకుల మొబైల్ నెంబర్లకు సమాచారం పంపించారు. ఇదీ రైల్వే ఉప‌శ‌మ‌న‌మ‌న్న‌మాట‌...