దిగొచ్చిన బంగారం ధర

  Written by : Suryaa Desk Updated: Sun, Oct 20, 2019, 09:25 PM
 

బంగారం ధర మరింత దిగొచ్చింది. ఎంసీఎక్స్ మార్కెట్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ ధర 10 గ్రాములకు 0.35 శాతం తగ్గుదలతో రూ.38,062కు క్షీణించింది. గత నెలలో బంగారం ధర రూ.40,000 మార్క్‌కు చేరింది. అప్పటి నుంచి చూస్తే ఇప్పుడు పసిడి ధర 10 గ్రాములకు ఏకంగా రూ.1,950 తగ్గింది.అదేసమయంలో ఎంసీఎక్స్ మార్కెట్‌లో శుక్రవారం వెండి ఫ్యూచర్స్ ధర కూడా తగ్గింది. వెండి ధర కేజీకి 0.7 శాతం తగ్గుదలతో రూ.45,228కి పడిపోయింది. ‘‘బంగారం ధర ఒక రేంజ్‌బౌండ్‌లో కదలాడవచ్చు. కొన్ని కీలక అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. భౌగోళిక ఉద్రిక్తతలు, ప్రపంచ వృద్ధి ఆందోళనలు వంటి వాటి కోణంలో చూస్తే బంగారం ధర పైకి కదిలే అవకాశముంది’’ అని కోటక్ సెక్యూరిటీస్ తెలిపింది.