పళనిస్వామికు గౌరవ డాక్టరేట్!

  Written by : Suryaa Desk Updated: Sun, Oct 20, 2019, 09:18 PM
 

తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి కె పళనిస్వామి ఆదివారం గౌరవ డాక్టరేట్ ను అందుకున్నారు. డాక్టర్ ఎంజీఆర్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ నుంచి ఆయనకు ఈ గౌరవం దక్కింది. ఈ సందర్భంగా తమిళనాడు సిఎం పళవిస్వామి మాట్లాడుతూ… ఎంజిఆర్ ఇనిస్టిట్యూట్ నుంచి డాక్టరేట్ స్వీకరించాడం సంతోషంగా ఉందని, ఇక నుంచి కె. పళనిస్వామి పేరు ముందు డాక్టర్ అనే కొత్త పదం చేరుతుందని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, ఇనిస్టిట్యూట్ ప్రతినిధులు పాల్గొన్నారు.