ఘ‌నంగా యోగ సంస్కృతం యూనివర్సిటీ స్నాతకోత్సవం

  Written by : Suryaa Desk Updated: Sun, Oct 20, 2019, 06:52 PM
 

అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలోని యోగ సంస్కృతం యూనివర్సిటీ 11వ కాన్వకేషన్   ఖైరతాబాద్‌లోని ఇంజనీర్స్ ఇన్ స్టిట్యూషన్‌లో ఘనంగా జరిగింది. ఈ స్నాతకోత్సవంలో పలువురికి డిగ్రీలు, డాక్టరేట్లు ప్రదానం చేశారు. గుంటూరుకు చెందిన ఆకురాతి వరహా కిషోర్ కుమార్ కు డాక్టరేట్ ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ ఛాన్సలర్ డాక్టర్ బివికె శాస్త్రి, వైస్ ఛాన్సలర్ ఎన్.వి.ఆర్.ఏ.రాజా, కిమ్స్ సీఈఓ డాక్టర్ బి.భాస్కర రావు, డాక్టర్ ఎస్. బిక్కం చంద్, వేద, ఆగమ ప్రవీణ అవధూత రాజయోగి, స్కోప్ సంస్థ చైర్మన్ డాక్టర్ కాశ్యప్ కె ప్రభాకర్, తమిళనాడులోని జెకెఆర్ ఆస్ట్రో రీచర్చ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ విజయ లక్ష్మి, వేదిక్ సైన్స్ జాతీయ సంస్థకు చెందిన లక్ష్మీ నారాయణ, చైతన్య గ్లోబల్ ఫౌండేషన్ ప్రతినిధి డాక్టర్ సురేష్, జెకెఆర్ ఆస్ట్రో రీసెర్చ్ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ ఎన్ విఆర్టే రాజా తదితరులు పాల్గొన్నారు.