మిస్టర్ ట్రిపుల్ సెంచరీయన్ కు పుట్టినరోజు శుభాకంక్షలు

  Written by : Suryaa Desk Updated: Sun, Oct 20, 2019, 06:10 PM
 

టీమిండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ ఈ రోజు 41వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా వీరూకి ప్రముఖుల నుంచి శుభాకంక్షలు వెల్లువెత్తుతున్నాయి. 'మోస్ట్ డేంజరస్' బ్యాట్స్ మెన్ కి జన్మదిన శుభాకంక్షలు అంటూ పలువురు ట్వీట్లు చేస్తున్నారు. క్రికెట్ కి వీడ్కోలు పలికిన తర్వాత సెహ్వాగ్ సామాజిక మాధ్యమాల్లో చురుకుగా ఉంటూ అభిమానులను అలరిస్తోన్న విషయం తెలిసిందే. తన పుట్టిన రోజు సందర్భంగా ఈ రోజు బీసీసీఐ చేసిన ట్వీట్ కి ఆయన స్పందించారు.
2008లో చెన్నైలో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచులో ఆయన 300 పరుగులు చేసిన వీడియోను బీసీసీఐ పోస్ట్ చేసింది. 'మిస్టర్ ట్రిపుల్ సెంచరీయన్ కు పుట్టినరోజు శుభాకంక్షలు' అని పేర్కొంది. దీనిపై వీరూ స్పందిస్తూ... 'మీ టైమింగ్ అద్భుతం.. ఏమి టైమింగ్.. సరిగ్గా అర్ధరాత్రి దాటగానే వీడియో అప్ లోడ్ చేశారు. బీసీసీఐకి ధన్యవాదాలు' అని రిప్లై ఇచ్చారు.
వీరేంద్ర సెహ్వాగ్ కి పలువురు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. 'స్పెషల్ ఫ్రెండ్ కి నా ప్రత్యేకమైన శుభాకాంక్షలు. చిరునవ్వు, వినోదాలతో పుట్టినరోజు జరుపుకోవాలని కోరుకుంటున్నాను' అని వీవీఎస్ లక్ష్మణ్ పేర్కొన్నారు.


 


'మోస్ట్ డేంజరస్ బ్యాట్స్ మెన్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు. నేను ఆయనను ఎన్నడూ ఔట్ చేయలేదు. ఆయన ఆధునిక కాలంలో వీఐవీ రిచర్డ్స్ వంటి వాడు' అని హర్భజన్ సింగ్ ట్వీట్ చేశాడు. కాగా, వీరితో పాటు వీరూకి చాలా మంది క్రికెటర్లు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.