ప‌ట్టాలెక్కిన బుద్ధిస్ట్ సర్క్యూ ట్ పర్యాటక రైలు

  Written by : Suryaa Desk Updated: Sun, Oct 20, 2019, 02:28 PM
 

గయా నుంచి ఆగ్రావ‌ర‌కు ప‌లు బౌద్ధ ఆరామాల‌ను చూసేందుకువీలుగా ఐఆర్సీటీసీ కొత్త‌గా బుద్ధిస్ట్ సర్క్యూ ట్ పర్యాటక రైలును ఢిల్లీ సఫ్దార్ జంగ్ స్టేషన్లో ఆరంభించింది. ఇది బిహార్లోని గయా, రాజ్గిరి, నలంద అక్కడి నుంచి వారణాసి, సారనాథ్ . తర్వాత నేపాల్లోని లుంబిని అక్కడి నుంచి కుశినగర్, శ్రావస్తి మీదుగా ఎనిమిదో రోజు ఆగ్రాకు చేరుకుంటుంది. 


మెత్తం ఎనిమిది భోగీలతో కూడిన ఈ రైలు మొదటి తరగతిలో 96, రెండో తరగతిలో 60 ఏసీ బెర్తులు న్నాయి. మూడు భోగీల‌ల్లో వంటశాల, హోటలు, భోజన శాల ఉన్నాయి. భారతీయ, చైనీస్, థాయ్ తది తర పలు రకాల వంటకాలను ప్రయాణికుల కోర్కె మేరకు అందిస్తామని చెప్పారు. వంట గదుల్లో మంటలు రాకుండా నివారించేందుకు కేవలం ఇనుప పలకల్ని వేడి చేసి ఆహారాన్ని తయారు చేసే అత్యాధునిక పద్ధతిని అవలంబిస్తామన్నారు రైల్వే అధికారులు.


 సెప్టెంబరు నుంచి మార్చి వరకు ఈ రైలు నడిపేందుకు ప్రణా ళిక లు సిద్ధం చేస్తోంది. ప్రతి కోచ్ లో ఓ భద్రతా సిబ్బంది ఉంటారు. బుద్ధుడి జీవిత విశేషాలతో కూడిన ఓ చిన్న గ్రంథాలయమూ రైల్లో ఉంది. బౌద్ధ మతా నికి సంబంధించిన చారిత్రక ప్రదేశాల సందర్శన కోసం ఎక్కువగా తూర్పు, దక్షిణ, ఈశాన్య ఆసియా దేశాల నుంచి పర్యాటకులు వస్తారని అధికారులు తెలిపారు. కాగా ఈ ఎన్నిమిది రోజుల‌ ప్రయాణ రుసుము తలకు ఫస్ట్ క్లాస్ కిరూ.1.23లక్షలు , సెకండ్ క్లాస్ లో రూ.లక్ష.