స్నేహితురాలితో రఫేల్ నాద‌ల్ వివాహం

  Written by : Suryaa Desk Updated: Sun, Oct 20, 2019, 11:00 AM
 

మ‌లోర్కా : స్పెయిన్ ఆట‌గాడు, గ్రాండ్‌స్లామ్ వీరుడు రఫేల్ నాద‌ల్ ఓ ఇంటివాడ‌య్యాడు. 14 ఏళ్లుగా ప‌రిచ‌య‌మున్న షిస్కా పెరెల్లోను నాద‌ల్ వివాహ‌మాడాడు. స్పెయిన్‌లో అంద‌మైన ఐలాండ్ల‌లో ఒక‌టైన‌ మ‌లోర్కాలో వీరి పెళ్లి జ‌రిగింది. 350 మంది స‌న్నిహితుల మ‌ధ్య షిస్కాను నాద‌ల్ పెళ్లాడాడు. వీరి వివాహానికి స్పెయిన్ రాజు జువాన్ కార్లోస్ కూడా హాజ‌రైన‌ట్లు తెలుస్తోంది. త‌న సోద‌రి మారిబెల్ చిన్న‌నాటి స్నేహితురాలైన షిస్కాను నాద‌ల్ 14 ఏళ్ల క్రితం ఓ వేడుక‌లో క‌లిశారు. వీరి ప‌రిచ‌యం స్నేహంగా మారి పెళ్లికి దారి తీసింది.