గోల్డ్‌మైన్‌ వద్ద డ్యామ్‌ కూలి 13 మంది గని కార్మికులు మృతి

  Written by : Suryaa Desk Updated: Sun, Oct 20, 2019, 10:25 AM
 

మాస్కో :  రష్యాలోని క్రాస్నోయార్స్క్‌లోని సైబీరియన్‌ నగరానికి దక్షిణంగా 160 కిలోమీటర్ల దూరంలో ఉన్న గోల్డ్‌మైన్‌ వద్ద డ్యామ్‌ కూలి 13 మంది గని కార్మికులు మృతి చెందారు. ఇక్కడ కురిసిన భారీ వర్షాల కారణంగా డ్యామ్‌కు గండి పడటంలో నీటి ప్రవాహం గని కార్మికుల నివాసాలను ముంచివేసింది. ఈ సంఘటనతో 14 మంది గని కార్మికులను ఆసుపత్రికి తరలించగా, గని వద్ద ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయని సంబంధిత వార్గలు పేర్కొన్నాయి. నీటి ప్రవాహం అక్కడి నివాసాలను ధ్వంసం చేసిన తీరును, సంబంధిత చిత్రాలను స్థానిక వార్తా ఛానల్‌ ప్రసారం చేసింది. గోల్డ్‌ మైన్‌ వద్ద భద్రతా నిబంధనల ఉల్లంఘనలపై సంబంధిత కమిటీ దర్యాప్తు ప్రారంభించింది.