ఫిలిప్పీన్స్‌లో భూకంపం.. ఐదుగురి మృతి, 77 మందికి గాయాలు

  Written by : Suryaa Desk Updated: Thu, Oct 17, 2019, 02:35 PM
 

ఫిలిప్పీన్స్‌ దేశంలోని ఉత్తర కొటబాటో ప్రాంతంలో భూకంపం సంభవించింది. బుధవారం రాత్రి సంభవించిన ఈ భూకంపం వల్ల ఐదుగురు మరణించగా, మరో 77 మంది గాయపడ్డారు. కాగా, ఈ భూకంప ప్రభావం రిక్టర్ స్కేలుపై 6.3 గా నమోదైంది. మకీలాలా పట్టణానికి 23 కిలోమీటర్ల దూరంలో రెండు కిలోమీటర్ల లోతులో భూకంపం వచ్చిందని ఫిలిప్పీన్స్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సెస్మాలజీ వెల్లడించింది. భూకంపం వల్ల గోడ కూలి ఏడేళ్ల బాలుడు మరణించాడు. వల్ల మకీలాల పట్టణంలో భూకంపం వల్ల 17 మంది గాయపడ్డారు. తులునాన్ పట్టణంలో మరో 60 మంది గాయపడ్డారు. ఈ భూకంపంతో ఫిలిప్పీన్స్‌ ప్రజలు భయాందోళనలు చెందారు. భూమి కంపిస్తున్న సమయంలో ప్రజలు భయంతో ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు.