జపాన్ లో ‘టైఫూన్ హగిబీస్’ భీభత్సం

  Written by : Suryaa Desk Updated: Wed, Oct 16, 2019, 02:59 PM
 

‘టైఫూన్ హగిబీస్’ తుపాన్ జపాన్ దేశాన్ని కుదిపేసింది. ఈ తుఫాను ధాటికి 72 మంది మృత్యువాత పడ్డారు. జపాన్ దేశాన్ని అల్లకల్లోలం చేసిన ఈ తుపాన్ ప్రభావం వల్ల 9,962 ఇళ్లు వరదనీటిలో మునిగిపోయాయి. భారీవర్షాల వల్ల జపాన్ దేశంలో వెల్లువెత్తిన వరదలతో పలు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. ఇజు పెనిన్సులా, టోక్యో పరిసర ప్రాంతాల్లో తుపాన్ ప్రభావం వల్ల భారీ నష్టం వాటిల్లింది. ఈ సందర్భంగా తుపాన్ సహాయ పనులు చేపట్టేందుకు 1,10,000 మంది అగ్నిమాపకశాఖ అధికారులు, పోలీసు, సెల్ఫ్ డిఫెన్స్ బలగాలను వరద ముంపు ప్రాంతాలకు పంపించారు.