అలాంట‌ప్పుడు బీరు తాగ‌ట‌మే బెట‌ర‌ట‌....

  Written by : Suryaa Desk Updated: Mon, Oct 14, 2019, 06:16 PM
 

తల నొప్పి, ఒళ్లు నొప్పులు.. లాంటి ఇబ్బంది కలిగినప్పుడు  ఏదొక పెయిన్ కిల్లర్ తీసుకుని వేసుకుంటాం .కానీ, లండన్ కు చెందిన గ్రీన్ విచ్ యూనివర్సిటీ పరిశోధన షాకింగ్ విషయాలు బయటపెట్టింది. నొప్పి తగ్గడానికి పారాసెట్మాల్ లాంటి పెయిన్ కిల్లర్ వేసుకోవడం క‌న్నా బీరు తాగడం మేలంటూ.బీర్ లవర్స్ కు చల్లటి కబురు చెప్పింది ఓ అధ్యయనసంస్ధ.
ఇంత‌కీ  ఆ స్డడీ సంస్ధ చేసిన ప‌రిశోధ‌న‌లో తేలిందేంటంటే తలనొప్పి లేదా మరే నొప్పికైనా సరే పారాసెట్మాల్ కంటే రెండు గ్లాసుల బీరు ఫాస్ట్ గా పని చేస్తుందని పారసెట్మాల్ తో పోలిస్తే బీర్ 25 శాతం బెటర్ రిలీఫ్ ఇస్తుందని చెప్పింది. దాదాపు 400 మందిపై గ్రీన్ విచ్ వర్సిటీ పరిశోధకులు చేసిన‌ఈ అధ్యయనంలో ఆల్కహాల్ ఒక మంచి అనల్జిసిక్ (పెయిన్ రిలీవర్ డ్రగ్) అని, ఇది క్లినికల్ గా కూడా ఫ్రూవ్ అయిందని చెబుతున్నారు పరిశోధకులు.
నొప్పి తీవ్రతను తగ్గించడంలో ఆల్కహాల్ వేగంగా పని చేస్తుందని చెప్పారు..రెండు గ్లాసుల బీరు తాగితే.. మన రక్తంలో 0.08 శాతం ఆల్కహాల్ లెవల్ పెరుగుతుందని, ఇది నొప్పి తీవ్రతను తగ్గించి, దాన్ని తట్టుకునేలా శరీరాన్ని మలచగలదని చెప్పారు. పారాసెట్మాల్ వంటి కొన్ని పెయిన్ కిల్లర్ టాబ్లెట్ల కన్నా ఇది వేగంగా పని చేస్తుందన్నారు.  కొన్ని పెయిన్ కిల్లర్ టాబ్లెట్ల కన్నా బీరు బాగా పని చేస్తుందని తమ అధ్యయనంలో పక్కాగా తేలిందని ఈ అధ్య‌య‌న బృంద స‌భ్యుడు డాక్టర్ థాంప్సన్ తెలిపారు.  అయితే మోతాదుకు మించి తీసుకుంటే దీర్ఘ కాలంలో ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుందని హెచ్చ‌రించారుఅయితే బీరు వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి క‌నుక‌ డాక్టర్ల సలహా ఫాలో అవడమే మేలని చెప్పారు.