నేపాల్‌లో లోయలో పడ్డ బస్సు 14 మంది మృతి...

  Written by : Suryaa Desk Updated: Sat, Oct 12, 2019, 01:38 PM
 

నేపాల్ దేశంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నేపాల్ దేశంలోని సింధూపాల్ చౌక్ ప్రాంతంలో 120 మంది ప్రయాణికులతో వేగంగా వస్తున్న బస్సు టైరు పంక్చర్ అయి ఈ ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న బస్సు టైరు పంక్చరు అవడంతో లోయలో పడింది. ఈ బస్సు ప్రమాదంలో 14మంది ప్రయాణికులు మరణించగా, మరో 98 మంది తీవ్రంగా గాయపడ్డారని సింధూపాల్ చౌక్ డీఎస్పీ మాధవరాజ్ కాఫ్లే చెప్పారు. కాగా క్షతగాత్రులను ధూలీఖేల్, షీర్ మెమోరియల్, ఖాట్మాండ్ ఆసుపత్రులకు తరలించారు. బస్సు ఓవర్ లోడ్ వల్ల ఈ ప్రమాదం జరిగినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.