పాకిస్థాన్ కు అమెరికా హెచ్చరిక....

  Written by : Suryaa Desk Updated: Sat, Oct 12, 2019, 12:59 PM
 

పాకిస్థాన్ కు అమెరికా గట్టి హెచ్చరిక చేసింది. ఉగ్రవాద సంస్థలకు నిధులను అందించడం మానుకోవాలని అమెరికన్ సెనేటర్ మ్యాగి హాసన్ హెచ్చరించారు. మరో సెనేటర్ క్రిస్ వాన్ హోలెన్ తో కలిసి పాకిస్థాన్ లో పర్యటించిన ఆమె, ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తో పాటు ఆర్మీ చీఫ్ ఖమర్ జావెద్ బజ్వాతో సమావేశమయ్యారు. ఉగ్రవాదాన్ని అడ్డుకుని ప్రపంచ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసేందుకు కృషి చేయాలన్నారు. ఉగ్రవాదాన్ని అణగదొక్కేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు విషయంలో ఇండియా, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు తగ్గించేందుకు తమ వంతు కృషి చేస్తామని పేర్కొన్నారు.