పాక్‌కు మద్దతు ఇస్తామన్న చైనా

  Written by : Suryaa Desk Updated: Thu, Oct 10, 2019, 11:09 AM
 

కాశ్మీర్‌ విషయంలో పాకిస్తాన్‌కు అవసరమైన మద్దతు ఇస్తామని చైనా పేర్కొంది. పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో సమావేశమయ్యారు.ఈ సందర్భంగా కాశ్మీర్‌లో పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని, అతి ముఖ్యమైన అంశాల్లో పాకిస్తాన్‌కు మద్దతు ఇస్తామని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ హామీ ఇచ్చారని పేర్కొంటూ జిన్హువా న్యూస్‌ ఏజెన్సీ వార్త వెలువరించింది. జమ్ము కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని తొలిగించి కేంద్ర పాలిత ప్రాంతాలుగా భారత ప్రభుత్వం ప్రకటించిన నాటినుంచి పాక్‌, భారత్‌ల మధ్య విభేదాలు మరింత పెరిగాయి.