కెనడాలో ముగ్గురు భారతీయ విద్యార్థుల దుర్మరణం

  Written by : Suryaa Desk Updated: Mon, Oct 07, 2019, 06:19 PM
 

 కెనడాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థులు దుర్మరణం చెందారు. వారిని పంజాబ్‌లోని గుర్‌దాస్‌పూర్‌, జలంధర్‌ జిల్లాలకు చెందిన తన్వీర్‌ సింగ్‌, గుర్విందర్‌, హర్‌ప్రీత్‌ కౌర్‌లుగా గుర్తించారు. ఉన్నత విద్య కోసం కెనడాలకు వెళ్లిన వీరు శుక్రవారం అర్ధరాత్రి కారులో బయటకు వెళ్లారు. అయితే వీరి వాహనం ఒంటారియోలోని అయిల్‌ హరిటేజ్‌ రోడ్డులో ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టినట్టు అక్కడి అధికారులు తెలిపారు. ఈఘ‌ట‌న‌తో బాధిత కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.