బార్‌లో దుండ‌గుడి కాల్పులు- న‌లుగురు మృతి

  Written by : Suryaa Desk Updated: Mon, Oct 07, 2019, 10:11 AM
 

 అమెరికా దేశంలో ఈ మధ్యకాలంలో ఎక్కువగా కాల్పులు, బాంబు దాడి ఘటనలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. వ్యక్తిగత కక్షతో, ఉగ్రవాదుల దాడి కారణంగా పలువురు అమాయకులు బలవుతున్నారు.  ఈ క్ర‌మంలోనే మ‌రోమారు తుపాకుల మోత మోగింది.   కాన్సాస్ నగరంలోని ఒక బార్ లో కి ప్ర‌వేశించిన దుండగుడు జరిపిన కాల్పుల్లో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే  మృతి చెంద‌గా మరో ఐదుగురికి తీవ్ర‌గాయాల‌య్యాయి, వారిని పోలీస‌లు  స‌మీప‌ ఆసుపత్రికి తరలించారు.  కాన్సాస్ నగరంలో జరిపిన దాడి ఉగ్రవాదుల పని అయ్యి ఉండవచ్చని ఇంటెలీజెన్స్ అధికారులు అనుమానిస్తున్నారు. కాల్పులకు తెగబడిన దుండగుడి కోసం పోలీసులు జల్లెడ పడుతున్నారు.