అమెరికాలో కాల్పుల కలకలం..

  Written by : Suryaa Desk Updated: Sun, Oct 06, 2019, 05:36 PM
 

అమెరికాలో మరోసారి కాల్పల కలకలం రేగింది. కాన్సస్ సిటీలోని ఓ బారులోకి చొరబడిన దుండగుడు కాల్పులు జరపడంతో నలుగురు చనిపోయారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిని వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 6.30గంటల సమయంలో ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.