14 ఏళ్ల త‌రువాత లాస్ ఏంజిల్స్ లో ఆటా మహాసభలు

  Written by : Suryaa Desk Updated: Sat, Oct 05, 2019, 02:13 AM
 

  14 సంవత్సరాల తరువాత మళ్లీ లాస్ ఏంజిల్స్ లో 16 వ ఆటా మహాసభలను నిర్ణ‌యించిన‌ట్టు అధ్యక్షులు పర్మేష్ భీంరెడ్డి తెలిపారు. శుక్ర‌వారం 2020 కాన్ఫరెన్స్ కిక్-ఆఫ్ గాలా డిన్నర్ లాస్ ఏంజిల్స్ లోని ఇర్విన్‌లో నిర్వహించిప సంద‌ర్భంగా ఆయ‌న మీడియాలో మాట్లాడుతూ వచ్చే సంవత్సరం జూలై 3వ తేది నుండి 5వ తేది వరకు హాలీవుడ్, డిస్నీ వరల్డ్, యూనివర్సల్ స్టూడియోస్ కు నిలయమైన లాస్ ఏంజిల్స్ లోని అనాహైమ్ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహిస్తామని  చెప్పారు.   తాజాగా జ‌రిగిన సాంప్రదాయ కిక్ ఆఫ్ డిన్నర్‌లో  దేశవ్యాప్తంగా వచ్చిన వారితో పాటు స్థానిక తెలుగు సంఘ నాయకులు, ఇతర మద్దతు దారులతో కలిసి దాదాపు మూడు వందల మంది హాజరయ్యారని వీరంతా సుమారు ఒక మిలియన్ డాలర్లు  అందించిన‌ట్టు చెప్పారు. 
జూలై 2006 లో త‌రువాత ఆటా మహాసభలు లాస్ ఏంజిల్స్‌లో జరుగుతుండ‌టంతో   స్థానిక తెలుగు సమాజంలో ఉత్సాహం ఉరకలేస్తుందన్నారు. తెలుగు అసోసియేషన్ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా (టాస్క్) ఈ సమావేశానికి స్థానిక అతిథిగా వ్యవహరిస్తుంది అదే విధంగా లాస్ ఏంజిల్స్ తెలుగు అసోసియేషన్ (లాటా), తెలుగు అసోసియేషన్ ఆఫ్ ట్రై-వ్యాలీ (టాట్వా) సహకారం అందించడానికి ముందుకొచ్చిందని తెలిపారు.