ఇంగ్లాండ్ అండ్ వేల్స్ హైకోర్టు సంచలన తీర్పు

  Written by : Suryaa Desk Updated: Thu, Oct 03, 2019, 07:21 AM
 

పాకిస్తాన్ కు మరోషాక్ తగిలింది. బ్రిటన్‌లో నేషనల్ వెస్ట్‌మిన్‌స్టర్ బ్యాంకు‌లో ఉన్న 35 మిలియన్ పౌండ్ల (దాదాపు రూ.305 కోట్లు) నిజాం సోమ్ము నిజాం వారసులకే చెందుతుందంటూ ఇంగ్లాండ్ అండ్ వేల్స్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 1948లో ఏడో నిజామ్ మిర్ ఉస్మాన్ అలీఖాన్ 1,007,940 పౌండ్లను పాకిస్థాన్ హైకమిషనర్ పేరిట నేషనల్ వెస్ట్‌మిన్‌స్టర్ బ్యాంకులో భద్రపరిచారు. భారత్‌లో హైదరాబాద్ విలీనమైన అనంతరం పాకిస్థాన్ ఆ సొమ్ము తమకే చెందుతుందని వాదించింది. హైదరాబాద్‌పై భారత్ సైనిక చర్య సమయంలో నిజాంకు ఆయుధాలు సరఫరా చేసినందుకు ప్రతిగా ఈ సొమ్ము తమకే చెందుతుందని వాదిస్తూ వస్తుంది. ఎంతో కాలంగా ఈ కేసులో వాదోపవాదాలు నడుస్తుండగా కోర్టు ఈరోజు తుదితీర్పు వెలువరించింది. ఆయుధాల చెల్లింపులకూ, ఎకౌంట్ ‌లోని సొమ్ముకూ ఎటువంటి సంబంధం లేదన్న న్యాయమూర్తి ఆ సొమ్ము నిజాం వారసులకు చెందుతుందన్నారు. అయితే హైదరాబాద్ విలీనం చట్టం సమ్మతం కాదు కాబట్టి భారత్‌కు ఈ మొత్తంపై ఎటువంటి హక్కూ ఉండదన్నారు.