చైనాలో భారీ అగ్నిప్రమాదం

  Written by : Suryaa Desk Updated: Mon, Sep 30, 2019, 07:31 PM
 

బీజింగ్ :  చైనాలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో 19 మంది సజీవదహనమయ్యారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. కాగా ఈ ప్రమాదం నుంచి ఎనిమిది మందిని పోలీసులు రక్షించారు. నిత్యావసర వస్తువుల తయారీ కంపెనీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగింది.