ఐదేళ్ల పిల్లోడిపై.. తొమ్మిదేళ్ల పిల్లలు అత్యాచారం

  Written by : Suryaa Desk Updated: Sun, Sep 29, 2019, 04:15 PM
 

సౌత్ ఆఫ్రికాలో ఐదేళ్ల పిల్లోడిపై తొమ్మిదేళ్ల వయసున్న నలుగురు పిల్లలు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. సౌత్‌ఆఫ్రికాలోని న్యూక్యాజిల్‌కు చెందిన ఐదేళ్ల విద్యార్థి ప్రతిరోజు లాగానే స్కూలుకు వెళ్లాడు. అయితే మధ్యాహ్నం స్కూలు అయిపోయిన వెంటనే నలుగురు విద్యార్థులు కలిసి అతడిని ఓ ఖాళీ క్లాస్‌రూంలోకి లాక్కెళ్లారు. అనంతరం అతడి బట్టలు విప్పేసి అత్యాచారానికి పాల్పడ్డారు. బాధిత బాలుడు ఇంటికి ఆలస్యంగా రావడంతో తల్లి ఏమైందని ప్రశ్నించడంతో.. తల్లికి జరిగిన విషయాన్ని వివరించాడు. విషయం తెలుసుకుని షాకైన తల్లి వెంటనే తన కొడుకుతో పాటు పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. తొమ్మిదేళ్ల పిల్లలు ఇలా చేశారని పోలీసులకు వివరించగా.. పిల్లల కోసం ప్రత్యేక సెల్ లేదంటూ పోలీసులు కేసును నమోదు చేసుకోలేదు. తన కొడుకుపై ఇలాంటి పనికి పూనుకున్న పిల్లలకు కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉందని బాధిత బాలుడి తల్లి చెబుతోంది.