పాక్‌తో క్రికెట్‌ ఆడబోము : జైశంకర్‌

  Written by : Suryaa Desk Updated: Thu, Sep 26, 2019, 01:09 PM
 

ఉగ్రవాదులకు మద్దతు ఇవ్వడం ఆపివేసే వరకూ పాకిస్తాన్‌తో క్రికెట్‌ ఆడబోమని భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్‌ చెప్పారు. న్యూఢిల్లి, ఇస్లామాబాద్‌ మధ్య ప్రధానంగా సాగుతున్న అంశం ఉగ్రవాదం, ఆత్మాహుతి దాడులు, హింసాకాండ అని ఆయన అన్నారు. ఇలాంటివి చేస్తూ మధ్యలో సరే.. టీ బ్రేక్‌ తీసుకుందాం, క్రికెట్‌ ఆడుకుందాం అంటే సరిపోతుందా? అని ఆయన ప్రశ్నించారు.