యూఏఈలో తగ్గనున్న ఉష్ణోగ్రతలు

  Written by : Suryaa Desk Updated: Wed, Sep 25, 2019, 11:14 AM
 

నేషనల్‌ సెంటర్‌ ఆఫ్‌ మిటియరాలజీ - ఎన్‌సిఎం, యూఏఈలో రానున్న ఐదు రోజుల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గనున్నాయని పేర్కొంది. చాలా చోట్ల ఆకాశం మేఘావృతమయి వుంటుందని అధికారులు పేర్కొన్నారు. హ్యుమిడిటీతోపాటు, ఫాగ్‌ లేదా మిస్ట్‌ ఫార్మేషన్‌ కొన్ని కోస్టల్‌ ఏరియాల్లోనూ, ఇంటర్నల్‌ ఏరియాల్లోనూ కనిపించే అవకాశముంది. గాలులు సాధారణం నుంచి ఓ మోస్తరు వేగంతో వీయనున్నాయి. అరేబియన్‌ గల్ఫ్‌ అలాగే ఒమన్‌ సీ సాధారణ నుంచి ఓ మోస్తరు రఫ్‌గా వుండొచ్చు. మొత్తంగా ఈ ఐదు రోజుల్లో గాలుల వేగం గంటకు 40 కిలోమీటర్లుగా వుండొచ్చు. బుధ, గురు, శుక్ర, శనివారాల్లో వాతావరణం దాదాపుగా ఇదే విధంగా కొనసాగుతుందని ఎన్‌సిఎం పేర్కొంది.