ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చిదంబరానికి మరోసారి నిరాశే

national |  Suryaa Desk  | Published : Thu, Sep 19, 2019, 04:43 PM

ఐఎన్ క్స్  మీడియా అవినీతి కేసులో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరానికి కోర్టులో మరోసారి నిరాశే ఎదురైంది. ఆయన జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీలోని రౌజ్‌ ఎవెన్యూ కోర్టు వచ్చే నెల 3 వరకూ పొడిగించింది. జైలు నుంచి బయటపడేందుకు చిదంబరం తీవ్రంగా ప్రయత్నాలు చేశారు. ఇందులో భాగంగా కొన్ని రోజుల క్రితం ఆయన EDకి సరెండర్ అవుతానని పిటిషన్ పెట్టుకోగా, కోర్టు తిరస్కరించింది. ఇవాళ్టితో ఆయన కస్టడీ ముగియడంతో సీబీఐ అధికారులు చిదంబరాన్ని తీహార్ జైలు నుంచి కోర్టుకు తీసుకురాగా… కస్టడీని అక్టోబర్ 3 వరకూ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం చిదంబరం తీహార్ జైలులో ఉన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com