ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పదోసారి తాత ఐన ట్రంప్‌

national |  Suryaa Desk  | Published : Wed, Aug 21, 2019, 05:53 PM


అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పదోసారి తాత అయ్యారు. ఆయన కుమారుడు ఎరిక్‌ ట్రంప్‌ భార్య లారా సోమవారం రాత్రి ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ఎరిక్‌ ట్విటర్‌లో పంచుకున్నాడు. 'ఈ ప్రపంచంలోకి కరోలినా డొరొతీ ట్రంప్‌ ను ఆహ్వానిస్తున్నాం' అంటూ ఆయన ట్వీట్‌ చేశారు. డొరోతితో కలుపుకుని డొనాల్డ్‌ ట్రంప్‌ మనవలు, మనవరాళ్ల సంఖ్య 10కి చేరింది. ఎరిక్‌కు ఇప్పటికే ఒక బాబు ఉన్నాడు. ముగ్గురు భార్యలున్న ట్రంప్‌నకు మొత్తం ఐదుగురు పిల్లలు. వారిలో పెద్దవాళ్లైన డొనాల్డ్‌ జూనియర్‌కు ఐదుగురు, ఇవాంకా ట్రంప్‌నకు ముగ్గురు పిల్లలు. ట్రంప్‌నకు సంబంధించిన వ్యాపార వ్యవహారాలను ఎరిక్‌ చూసుకుంటారు.  







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com