ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గొడుగుతో తప్పిన మెరుపు దాడి

international |  Suryaa Desk  | Published : Sun, Aug 18, 2019, 07:01 PM

ఉరుములు మెరుపులతో వర్షం కురుస్తున్నప్పుడు బయటకు వెళ్లకూడదనేది అందరూ చెప్పేమాట. ఇటువంటి సమయంలో పిడుగుపాటుకు గురైతే ఒక్కోసారి ప్రాణాలు కూడా కోల్పోవాల్సి వస్తుంది. అయితే..తప్పనిసరి పరిస్థితుల్లోనో లేదా సరాదాకోసమనో కొందరు ఇటువంటి ప్రయత్నమే చేసి చిక్కుల్లో పడుతుంటారు. అమెరికావాసి రోమ్యులస్ మెక్‌నీల్ కూడా సరిగ్గా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నాడు. దక్షిణ కెరొలీనా రాష్ట్రానికి చెందిన మెక్‌నీల్.. ఓ రోజు భారీ వర్షం కురుస్తుండగా ఇంటి బయట పార్క్ చేసి ఉన్న కారు వద్దకు వెళ్లాడు. కాగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అప్పటికే రేడియోలో హెచ్చిరికలు జారీ అయ్యాయి. పిడుగులు పడే అవకాశం ఉందనేది ఆ హెచ్చరికల సారాంశం.


అయితే మెక్‌నీల్ మాత్రం కొద్దిగా రిస్క్ చేశాడు. గొడుగేసుకుని కారు వైపు నడవసాగాడు. ఇంతలో ఒక్కసారిగా అతడిపై పిడుగుపడింది. అదృష్టవశాత్తూ తల మీద రక్షణగా గొడుగు ఉండటంతో అతడు పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. పరిసర ప్రాంతాల్లో అమర్చిన కెమెరాల్లో ఇదంతా రికార్డయింది. ప్రాణాపాయం తప్పినందుకు సంబరపడిపోయిన మెక్‌నీల్..తనే స్వయంగా వీడియోలను ఫేస్‌బుక్‌లో షేర్ చేశాడు. అంతే..క్షణాల్లో ఇది వైరల్ అయిపోయంది. "హలో మెక్‌నీల్.. నువ్వు పిడుగుపాటు నుంచి తప్పించుకున్నావంటే చాలా అదృష్టవంతుడివని అర్థం అవుతోంది. కాబట్టి.. నువ్వు ఓ లాటరీ టిక్కెట్టు కూడా కొనుక్కో. నీకు జాక్‌పాట్ కూడా తగలచ్చు' అని కొందరు చమత్కరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com