హైదరాబాద్: సైబీరియాలో ఉన్న ఆయుధ డిపోలో భారీ పేలుడు జరిగింది. రష్యా మిలిటరీ డిపో పేలినట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో వేలాది మందిని అక్కడ నుంచి తరలించారు. అచింక్ పట్టణానికి చేరువలో జరిగిన పేలుడు వల్ల సుమారు 8 మంది గాయపడ్డారు. ఆయుధ డిపోలో వేల సంఖ్యలో ఆర్టిలరీ షెల్స్ ఉన్నట్లు గుర్తించారు. సాక్షులు కొందరు ఆ పేలుడుకు సంబంధించిన వీడియోలను పోస్టు చేశారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఎమర్జెన్సీ ప్రకటించారు.