ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విమానంలో గబ్బిలం.. ఆందోళనలో ప్రయాణికులు...

international |  Suryaa Desk  | Published : Sun, Aug 04, 2019, 11:42 AM

విమానంలోకి గబ్బిలం దూరి ప్రయాణికులను భయాందోళనకు గురిచేసిన ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... అమెరికాలోని నార్త్ కరోలినా నుంచి న్యూజెర్సీకి స్పిరిట్ ఎయిర్ లైన్స్ విమానం ఒకటి బయలుదేరింది. అందులో నిండుగా ప్రయాణికులు ఉన్నారు. అంతలో ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ, ఓ గబ్బిలం విమానంలో ఎగరడం ప్రారంభించింది.


దీన్ని చూసిన పలువురు ప్రయాణికులు హడలిపోగా, ఇంకొందరు వాష్ రూమ్ లోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు. ఈ తతంగాన్ని ఓ ప్రయాణికుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కాగా, స్పిరిట్ ఎయిర్ లైన్స్ తీరుపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాదిలో స్పిరిట్ విమానాల్లో గబ్బిలాలు కనిపించడం ఇది రెండోసారనీ, ఇకపై జీవితంలో స్పిరిట్ విమానయాన సంస్థ విమానాలు ఎక్కబోనని ఓ ప్రయాణికుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com