ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇకపై సూపర్ మార్కెట్లలో కూడా పెట్రోల్, డీజిల్!

national |  Suryaa Desk  | Published : Tue, Jun 18, 2019, 07:33 PM

పెట్రోల్ ‌బంకులతో పాటు వినియోగదారులు ఇకపై సూపర్ మార్కెట్లలో కూడా పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేసే సదుపాయం అమలు కానుంది. ఈ మేరకు నిబంధనలను సడలిస్తూ కేంద్ర పెట్రోలియ, సహజవాయువు మంత్రిత్వశాఖ త్వరలోనే ఓ ప్రతిపాదన ప్రవేశ పెట్టనున్నట్టు సమాచారం. దీంతో త్వరలోనే సూపర్ మార్కెట్లు, షాపింగ్ మాల్స్, వాణిజ్య సముదాయాల్లో ఇంధనం అమ్మకాలు సాగించేలా అనుమతి లభించనుంది. ఇదే సమయంలో ఇంధనరంగంలోకి ప్రవేశించాలనుకునే ప్రైవేట్ కంపెనీలకు అవసరమైన కనీస వసతులను కూడా కేంద్రం సవరించనుంది. కనీస పెట్టుబడి రూ. 2 వేల కోట్లు, 30 లక్షల టన్నుల క్రూడాయిల్ కు బ్యాంకు గ్యారెంటీలు తదితర నిబంధనలను సడలించనున్నట్టు సమాచారం.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com