ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇక గాల్లో తిరిగే టాక్సీలు

national |  Suryaa Desk  | Published : Sat, Jun 15, 2019, 10:01 AM

 ఇప్పటికే ఆటోలు, క్యాబ్ లు, టాక్సీల ద్వారా అనేక మంది ప్ర‌యాణీకుల‌కు చేరువైన ఉబర్ సంస్ధ  ఫ్లయింగ్ టాక్సీలు తీసుకువ‌చ్చేందుకు రంగం సిద్దం చేస్తోంది. ఈ ఫ్లయింగ్ టాక్సీ సేవలను ముందుగా ఆస్ట్రేలియాతో పాటు యూఎస్ లోని డల్లాస్, లాస్ ఏంజెల్స్ లో అందించ‌నుంది. మెల్ బోర్న్ లో 2020 నుంచి టెస్ట్ ఫ్లయిట్లను ప్రారంభించనున్నామ‌ని, 2023 నాటికి అక్కడ పూర్తి స్థాయిలో సేవలను అందించనున్నామ‌ని కంపెనీ ప్ర‌తినిధులు చెప్పారు. పెరుగుతున్న ట్రాఫిక్ నేప‌థ్యంలో  భవిష్యత్తులో ఫ్లయింగ్ టాక్సీలదే రవాణాలో కీలక పాత్ర కానున్న   ఉబర్  తెలిపింది.  ఎగిరే టాక్సీల వల్ల ప్రయాణం సులువవుతుందని,  మెల్ బోర్న్ లో ఉన్న విమానాశ్రయానికి మెల్ బోర్న్ నగర నడిబొడ్డు నుంచి కారులో వెళ్లాలంటే గంట సమయం పడుతుంది. అదే ఎయిర్ టాక్సీ ద్వారా 10 నిమిషాల్లో చేరుకోవచ్చని పేర్కొంది. ఇప్ప‌టికే  ఎయిర్ టాక్సీలను ఎంబ్రేర్, పిపిస్ట్రెల్ ఎయిర్ క్రాఫ్ట్ అనే విమానాలను తయారు చేసే సంస్థలు దీన్ని తయారు చేస్తున్నాయి. ఈ ఎయిర్ టాక్సీల కోసం ఉబర్ నాసా, యూఎస్ సైన్యంతో కలిసి పనిచేస్తోంద‌ని తెలిపింది.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com