ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శాసనసభలో కొనసాగుతున్న ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jun 12, 2019, 12:18 PM

ఏపీ శాసనసభ సమావేశాలు కొనసాగుతున్నాయి. ప్రొటెం స్పీకర్‌ అప్పలనాయుడు ఎమ్మెల్యేలచే ప్రమాణం చేయిస్తున్నారు. అసెంబ్లి సమావేశాలు ప్రారంభమైన వెంటనే ప్రొటెం స్పీకర్‌ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని చేపట్టారు. మొదటగా సీఎం జగన్మోహన్‌రెడ్డి చే ప్రమాణం చేయించారు. ఆ తర్వాత ప్రతిపక్ష నేత చంద్రబాబుతో ప్రమాణం చేయించారు. అనంతరం ఉపముఖ్యమంత్రులతో ప్రమాణం చేయించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శాసనసభ సమావేశంలో నందమూరి బాలకృష్ణ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రొటెం స్పీకర్ శంబంగి చిన వెంకట అప్పలనాయుడు బాలకృష్ణ తో ప్రమాణస్వీకారం చేయించారు. ఏపీ శాసన సభలో ఆదిమూలపు సురేష్‌ ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. ప్రొటెం స్పీకర్‌ అప్పలనాయుడు ఆదిమూలపు సురేష్‌తో శాసనసభ సభ్యుడిగా ప్రమాణం చేయించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శాసనసభ సమావేశాల్లో పేర్ని వెంకట్రామయ్య (నాని) ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రొటెం స్పీకర్ పేర్ని వెంకట్రామయ్య (నాని) చే ప్రమాణస్వీకారం చేయించారు. పేర్ని వెంకట్రామయ్య (నాని) రవాణా, సమాచార – ఫౌర సంబంధాల శాఖ మంత్రిగా  ఉన్నారు. శాసన సభలో మేకతోటి సుచరిత ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. ప్రొటెం స్పీకర్‌ అప్పలనాయుడు మేకతోటి సుచరితతో శాసనసభ సభ్యురాలిగా ప్రమాణం చేయించారు. ఏపీ శాసన సభలో పినిపె విశ్వరూప్‌ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రొటెం స్పీకర్‌ అప్పలనాయుడు పినిపె విశ్వరూప్‌తో శాసనసభ సభ్యుడిగా ప్రమాణం చేయించారు. ఏపీ శాసన సభలో కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. ప్రొటెం స్పీకర్‌ అప్పలనాయుడు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మితో శాసనసభ సభ్యురాలిగా ప్రమాణం చేయించారు. చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా శాసనసభ సభ్యురాలిగా ప్రమాణస్వీకారం చేశారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో రోజాతో ప్రొటెం స్పీకర్ ప్రమాణం చేయించారు. ఎమ్మెల్యే రోజా దైవసాక్షిగా ప్రమాణస్వీకారం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com