ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బిల్డింగ్‌పై కూలిన హెలికాప్ట‌ర్‌

international |  Suryaa Desk  | Published : Tue, Jun 11, 2019, 11:36 AM

అమెరికాలో ఓ భారీ బిల్డింగ్‌పై హెలికాప్ట‌ర్ కూలింది. ఈ ఘ‌ట‌న‌లో దాని పైల‌ట్ మృతిచెందాడు. న్యూయార్క్‌లోని మ‌న్‌హ‌ట‌న్‌లో ఉన్న 51 అంత‌స్తుల బిల్డింగ్ రూఫ్‌పై హెలికాప్ట‌ర్ కూలింది. బిల్డింగ్‌పైన పొగ క‌మ్ముకుపోయింది. అయితే అగ్నిమాప‌క సిబ్బంది వెంట‌నే మంట‌ల్ని ఆర్పారు. హెలికాప్ట‌ర్ కూలిన‌ బిల్డింగ్ టైమ్స్ స్క్వేర్‌కు ద‌గ్గ‌ర‌గా ఉంది. బిల్డింగ్‌పై హెలికాప్ట‌ర్ కూలడంతో.. న్యూయార్క్ ప్ర‌జ‌లు ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డ్డారు. 2001లో జ‌రిగిన సెప్టెంబ‌ర్ 11 దాడుల‌ను గుర్తు చేసుకున్నారు. ప్ర‌మాదంలో పైల‌ట్ టిమ్ మాక్ కార్మాక్ మృతిచెందాడు. ట్విన్ ఇంజిన్ అగ‌స్టా ఏ109ఈ హెలికాప్ట‌ర్ కూలిన‌ట్లు అధికారులు చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com