వరల్డ్ కప్ లో భాగంగా ఈ రోజు కార్డిఫ్ వేదికగా ఇంగ్లాండ్, బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ మరి కొద్ది సేపటిలో ప్రారంభం కానుంది. వాతావరణం దట్టంగా మబ్బు పట్టి ఉన్నప్పటికీ వర్షం కురవడం లేదు. పాకిస్థాన్ తో పరాజయంతో ఇంగ్లాండ్ ఈ మ్యాచ్ లో విజయం సాధించాలన్న పట్టుదలతో ఉంది. మరో వైపు బంగ్లాదేశ్ జట్టు కూడా మంచి ఫాంలో ఉండటంతో మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతుందన్న అంచనాలు ఉన్నాయి. ఇప్పటి వరకూ వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్, బంగ్లాదేశ్ లు మూడు సార్లు తలపడగా ఇంగ్లాండ్ 1 సారి, బంగ్లాదేశ్ రెండు సార్లు విజయం సాధించింది.