ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నిఘా నీడలో ఢిల్లీ

national |  Suryaa Desk  | Published : Tue, Jun 04, 2019, 02:27 PM

మొత్తానికి కేజ్రీవాల్ తన పంతం నెగ్గించుకున్నారు. తమ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించిన 1.4లక్షల కెమెరాల ఏర్పాటుకు త్వరలో శ్రీకారం చేయనున్నారు. జూన్ 8 నుంచి ఢిల్లీ వ్యాప్తంగా పలు ప్రదేశాల్లో కెమెరాలను అమర్చబోతున్నట్లు ఆయన సోమవారం వెల్లడించారు. ‘‘మొత్తం 1.4లక్షల సీసీ కెమెరాల ఏర్పాటుకు సంబంధించిన టెండర్‌కు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 70వేల కెమెరాలకు ఇప్పటికే సర్వే కూడా పూర్తి చేశాం’’ అని ఆయన అన్నారు. ఈ మొత్తం కెమెరాల ఏర్పాటును డిసెంబర్‌ నాటికి పూర్తి చేస్తామని ఆయన తెలిపారు.


అయితే 2015 అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో ఢిల్లీ వ్యాప్తంగా 1.4లక్షల కెమెరాలను అమర్చుతామంటూ కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. ఆ తరువాత ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసినప్పటికీ.. ఈ ప్రాజెక్ట్ ఆమోదానికి లెఫ్టినెంట్ గవర్నర్ నుంచి ఆమోదం లభించలేదు. దీంతో ఈ ప్రాజెక్ట్ ఇన్నిరోజులు కార్యరూపం దాల్చలేకపోయింది. అయితే గత ఏడాది ఆగష్టులో దీనికి ఆమోదం లభించడంతో త్వరలో ఢిల్లీ వ్యాప్తంగా కెమెరాల ఏర్పాటుకు మార్గం సుగమమైంది. కాగా ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగడానికి 8నెలల ముందే ఈ ప్రాజెక్ట్‌కు గ్రీన్‌సిగ్నల్ లభించి.. కార్యరూపం దాల్చడం విశేషం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com