ఐరోపాలోనే ఎత్తైన అగ్ని పర్వతం మౌంట్ ఎట్నా ఉగ్రరూపం క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ఇటలీలోని మూడు అగ్నిపర్వతాల్లో అతి పెద్దదిగా పేరొందిన ఈ ఈ అగ్నిపర్వతం నుంచి వెలువడుతున్న లావా, బూడిద . కెటానియా నగరం మీదకు ఎగసిపడుతు జనజీవనానికి ఇబ్బంది కలిగిస్తోంది. మరోవైపు అగ్నిపర్వతంలోని రెండు పగుళ్ల ద్వారా ఎగసిపడుతున్న లావా ఉత్తర, దక్షిణ దిశల్లో కిలోమీటరున్నర దూరం వరకు విస్తరించినట్టు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ జియో ఫిజిక్స్ అండ్ వొల్కనాలజీ (ఐఎన్జివి) అధికారులు వెల్లడించారు. గురువారం ఉగ్రరూపం దాల్చిన అగ్ని పర్వతం నుంచి వెలువడుతున్న లావా ప్రస్తుతం తగ్గుముఖం పట్టినప్పటికీ, పర్వతారోహకులకు ప్రమాదం పొంచి ఉన్నట్లు ఐఎన్జివి పేర్కొంది
మరోవైపు మౌంట్ ఎట్నా మెల్లమెల్లగా మధ్యదర సముద్రం వైపు కదిలిపోతోందని ప్రతి సంవత్సరం 14మి.మీ.ల చొప్పున పర్వతం సముద్రంవైపు కదులుతున్నట్లుగా తమ పరిశోధనల్లో వెల్లడైందని శాస్త్రవేత్తలు తెలిపారు.. 2001 నుంచి 2012 శాస్త్రవేత్తలు ఎట్నాపై పరిశోధనలు జరుపుతున్నారు. అయితే అగ్నిపర్వతం సముద్రంలో కలిసేందుకు ఇంకా వందేళ్ల సమయం పట్టే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెప్పారు. ఎట్నా మధ్యదరా సముద్రంలో కలిసిపోతే సముద్రంలో కలిసిన మొదటి అగ్నిపర్వతంగా ఎట్నా నిలిచే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెప్పారు. అయితే ఎట్నా పర్వతం సముద్రంలో కలిసిపోతే ప్రమాదాలు ఎదురయ్యే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.