పిచ్చి పీక్‌కు చేరింది!వరద నీటిలో నిల‌బ‌డి రిపోర్టింగ్!

  Written by : Suryaa Desk Updated: Thu, Apr 18, 2019, 10:23 PM
 

నాడు పాకిస్థాన్‌లో గాడిదపై ఎక్కి ఓ రిపోర్టర్ రిపోర్టింగ్ చేస్తూ బొక్క బోర్లాపడి సెన్సేషనల్ సృష్టిస్తే.. తాజాగా మరొకరు మరీ లైవ్‌గా ఉంటుందని వరద నీళ్లలో నిలబడి రిపోర్టింగ్ చేసిన వైనం జర్నలిస్ట్ లోకాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. ‘‘ఎవరూ తేలేని, ఏ చానలూ కవర్ చేయని వార్తను నువ్వు తేవాలంటూ ప్రొడ్యుసర్ హుకుం జారీ చేయడంతో జర్నలిస్ట్, తన ప్రాణాలకు తెగించి వరద నీటిలో ఇలా రిపోర్టింగ్ చేశాడంటూ’’ నైలా ఇనయత్ అనే ఒక జర్నలిస్ట్ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. లైవ్‌గా ఆ నీటిలోనే ఛాతీ వరకు నిలబడి ‘అత్యంత సాహసంగా’ రిపోర్ట్ చేసేసరికి తమ ట్విట్టర్‌లలో నెటిజన్లు సెటైర్లతో విరుచుకుపడ్డారు. ఇదో పెద్ద కామెడీ ప్రహసనంలా తయారైందని ఒకరంటే.. మరొకరు ఇలాంటి వారికి పులిట్జర్ అవార్డు ఇవ్వాలంటూ జోకులేశారు.