తమిళనాడు ఫిల్మ్ ఇండస్ట్రీని శాసించే హీరోల్లో తాను ఒకడు కానీ... ఓటు హక్కు వినియోగించుకోవడానికి సామాన్యుడిలా క్యూలైన్లో వెళ్లి ఓటు హక్కు వినియోగించుకున్నారు తమిళ హీరో విజయ్.. ఎలాంటి హడావిడి లేకుండా చెన్నై నగరంలో నీలంకిరిలోని పోలింగ్ స్టేషన్కు వెళ్లిన ఆయన.. అందరితో పాటు క్యూలో చాలా సేపు నిలబడి తన ఓటు హక్కు వినియోగించుకుని వెళ్లిపోయాడు... విజయ్ సాధారణ పౌరుడిలా ఓటు వేసిన వీడియోలు, ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.